వాషింగ్టన్:
వ్యవసాయ క్షేత్రాల్లో నీటి అవసరాలను పర్యవేక్షించేందుకు సహకరించే
అధునాతన స్మార్ట్‌ఫోన్ యాప్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
నీటి వినియోగానికి సంబంధించిన డిజిటల్ చిత్రపటాలను ఈ యాప్ సిద్ధంచేస్తుంది.
నెబ్రాస్కా, గూగుల్, ఇదాహా వర్సిటీల శాస్త్రవేత్తలు దీన్ని ఆవిష్కరించారు.
ఈఫ్లక్స్ (ఈఈఫ్‌ఎల్‌యూక్స్)గా పిలుస్తున్న ఈ యాప్ ద్వారా.. ప్రపంచంలో
ఎవరైనా తమ పంట పొలాలకు సంబంధించిన నీటి వినియోగ చిత్రపటాలు పొందొచ్చు.
మెట్రిక్ తాజా సాంతికేతికత ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. సాగు నీటి
వినియోగాన్ని పర్యవేక్షించేందుకు అమెరికాలోని 15 రాష్ట్రాల్లోని నీటి పారుదల
నిర్వాహకులు ప్రస్తుతం దీన్ని ఉపయోగిస్తున్నారు. అంతర్జాలంతో అనుసంధానించిన
మొబైల్‌లో ఈ యాప్ ద్వారా తమ పొలాలకు సంబంధించిన సమాచారాన్ని రైతులు
నేరుగా తెలుసుకునే వీలుంది.
No comments:
Post a Comment